MLA Raghunandan Rao:రూ.4 వేల కోట్ల భూదందా కోసమే ఇదంతా, ఏపీ బీఆర్ఎస్ ఛీఫ్ తోట చంద్రశేఖర్‌పై రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.4 వేల కోట్ల తెలంగాణ ఆస్తులను ఒక ఆంధ్ర కాంట్రాక్టర్‌కు సీఎం కేసీఆర్(CM KCR) కట్టబెడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) ఆరోపించారు.
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.4 వేల కోట్ల తెలంగాణ ఆస్తులను ఒక ఆంధ్ర కాంట్రాక్టర్‌కు సీఎం కేసీఆర్(CM KCR) కట్టబెడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) ఆరోపించారు. ఖమ్మంలో బుధవారం నిర్వహించబోయే బీజేపీ(BRS) సభకు.. ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడిగా నియమితులైన తోట చంద్రశేఖర్ ఖర్చు పెడుతున్నారని అన్నారు. మియాపూర్‌లో అత్యంత విలువైన భూములను తోట చంద్రశేఖర్‌కు ఎలా కట్టబెడుతున్నారంటూ నిలదీశారు.
ఇదంతా సోమేష్‌కుమార్ కనుసన్నల్లోనే జరుగుతోందన్నారు. ఇందులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పాత్ర ఉందని, సుఖేష్‌గుప్తా వ్యవహారంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన రంగారెడ్డి కలెక్టర్.. తోట చంద్రశేఖర్ వ్యవహారంలో సుప్రీంను ఎందుకు ఆశ్రయించలేదని రఘునందన్‌రావు ప్రశ్నించారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మియాపూర్ భూముల అంశాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)