Bomb Threat: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు ఫోన్‌కాల్‌, ఆగంతకుడిని పట్టుకున్న పోలీసులు, అతని చెప్పిన సమాధానంతో షాక్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు ఫోన్‌కాల్‌ వచ్చింది. హైదరాబాద్‌-చెన్నై ఇండిగో విమానంలో బాంబు పెట్టానంటూ ఓ ఆగంతకుడు ఫోన్‌ చేశాడు. పోలీసులు ఆఘమేఘాల మీద తనిఖీ చేశాక విమానంలో బాంబులేదని అధికారులు నిర్ధారించుకున్నారు.

Credits: Wikimedia Commons

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు ఫోన్‌కాల్‌ వచ్చింది. హైదరాబాద్‌-చెన్నై ఇండిగో విమానంలో బాంబు పెట్టానంటూ ఓ ఆగంతకుడు ఫోన్‌ చేశాడు. పోలీసులు ఆఘమేఘాల మీద తనిఖీ చేశాక విమానంలో బాంబులేదని అధికారులు నిర్ధారించుకున్నారు. ఫోన్‌ చేసిన వ్యక్తిని వెంటనే ట్రేస్‌ చేసిన పోలీసులు అతనిని అజ్మీరా భద్రయ్యగా గుర్తించారు. భద్రయ్యను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. అతను చెప్పిన కారణం విని అధికారులు బిత్తరపోయారు. విమానంలో భద్రయ్య చెన్నై వెళ్లాల్సి ఉంది. కానీ, ఆలస్యంగా రావడంతో విమానం ఎక్కేందుకు ఆయన్ని సిబ్బంది అనుమతించలేదు. దీంతో కోపంతోనే విమానంలో బాంబు పెట్టానంటూ ఫోన్‌ చేసి బెదిరించాడట.

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement