KTR Questions Revanth Reddy: ఇదేనా ఇందిరమ్మ పాలన?, మహిళా జర్నలిస్టులకే రక్షణ లేదా?, సీఎం రేవంత్ రెడ్డి సొంతగ్రామంలో మహిళా జర్నలిస్టుల దాడిని ఖండించిన కేటీఆర్
విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇదేనా ఇందిరమ్మ పాలన?, మహిళా జర్నలిస్టులకే రక్షణ లేదా అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిపై రేవంత్ రెడ్డి అనుచరులు దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు
Hyd, Aug 22: విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇదేనా ఇందిరమ్మ పాలన?, మహిళా జర్నలిస్టులకే రక్షణ లేదా అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిపై రేవంత్ రెడ్డి అనుచరులు దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు.
జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన కాంగ్రెస్ గుండాలపై కేసులు నమోదు చేయాలని డీజీపీని కోరారు కేటీఆర్. మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై వెంటనే మహిళా కమిషన్ కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 'స్వామీ.. ఈ పాపాత్ముడైన ముఖ్యమంత్రిని క్షమించు'..రేవంత్‌పై హరీశ్ ఫైర్, మాట తప్పిన సీఎం ఆలయాలను శుద్దిచేయాలని కామెంట్, రుణమాఫీ చేసే వరకు వదలిపెట్టమని వార్నింగ్
Here's KTR Tweet: