KTR On Farmers Problem: కాంగ్రెస్ చేసిన కమాల్ ఇదే,ఆగమైతున్న తెలంగాణ రైతు, సంక్షోభంలో సాగు? ఆసక్తికర ట్వీట్ చేసిన కేటీఆర్
ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్..ఒక్క ఏడాదిలోనే.. 15.30 లక్షల ఎకరాల్లో తగ్గిన సాగు విస్తీర్ణం తగ్గిందని ఆగమైతున్న తెలంగాణ రైతు బతుకుకు.. తొలి ప్రమాద సంకేతం ఇది అన్నారు.
Hyd, Aug 12: కేసీఆర్ పాలనలో సాగుకు స్వర్ణయుగం కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం మొదలైందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్..ఒక్క ఏడాదిలోనే.. 15.30 లక్షల ఎకరాల్లో తగ్గిన సాగు విస్తీర్ణం తగ్గిందని ఆగమైతున్న తెలంగాణ రైతు బతుకుకు.. తొలి ప్రమాద సంకేతం ఇది అన్నారు.
ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నయ్..కానీ చేతలు సచివాలయం గేటు దాటడం లేదు అని ఎద్దేవా చేశారు. బురద రాజకీయాలు తప్ప.. సమయానికి సాగు నీళ్లిచ్చే సోయి అసలే లేదు.. ఎరువులు-విత్తనాల కోసం రైతులకు తిప్పలు..క్యూలైన్ లో పాసుబుక్కులు, చెప్పులు..కొత్త రుణాల కోసం బ్యాంకుల వద్దే..
పగలూ రాత్రి తేడాలేకుండా పడిగాపులుఅప్పుల బాధతో..అన్నదాతల ఆత్మహత్యలు ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి ఇదన్నారు.
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)