KTR Questions CM Revanth Reddy: చారాణ కోడికి బారాణ మసాలా, అర్హత ఉన్న రైతులకు రుణమాఫీ ఎందుకు కాలేదు?, సీఎం రేవంత్‌ రెడ్డికి కేటీఆర్ ప్రశ్న

ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్... కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసి తీరుని గమనిస్తే చారాణ కోడికి..! బారాణ మసాలలా ఉందని ఎద్దేవా చేశారు. రుణమాఫీ అయిన రైతులకన్నా

KTR Questions CM Revanth Reddy.(Twitter)

Hyd, July 19: సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్... కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసి తీరుని గమనిస్తే చారాణ కోడికి..! బారాణ మసాలలా ఉందని ఎద్దేవా చేశారు. రుణమాఫీ అయిన రైతులకన్నా..కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ అన్నారు.

అన్నివిధాలా అర్హత ఉన్నా..ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పెటోడు లేడు...రైతులు గోడు చెప్పుకుందామంటే వినేటోడు లేడు అని మండిపడ్డారు.

నలభై లక్షల మందిలో.. మెజారిటీ రైతులకు నిరాశే మిగిల్చినందుకా ?,ముప్ఫై లక్షల మందిని మోసం చేసినందుకా ? అని ప్రశ్నించారు. జూన్ లో వేయాల్సిన రైతుభరోసా.. జూలై వచ్చినా రైతుల ఖాతాలో వెయ్యలేదన్నారు. ఇంతకాలం.. అటెన్షన్ డైవర్షన్..!ఇప్పుడేమో.. ఫండ్స్ డైవర్షన్ అని చురకలు అంటించారు.  జూలై 22 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, ఆరు కొత్త బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం, బిఎసి సభ్యులు ఎవరెవరంటే..

Here's Tweet:

సీఎం గారు...

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు