MLC Kavitha Viral Video: కల్వకుంట్ల కవితకు అస్వస్థత...ప్రచార వాహనం పైనే కళ్లుతిరిగి పడిపోయిన కవిత...వీడియో వైరల్..

అంతేకాదు ప్రచార వాహనంపైనే ఆమె కళ్లు తిరిగి పడిపోయారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం ఇటిక్యాలలో చోటు చేసుకుంది. శనివారం ఉదయం ఎమ్మెల్సీ కవిత రోడ్‌ షోలో పాల్గొన్నారు.

Telangana Rashtra Samithi leader K Kavitha. (Credits: Facebook)

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురయ్యారు. అంతేకాదు ప్రచార వాహనంపైనే ఆమె కళ్లు తిరిగి  పడిపోయారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం ఇటిక్యాలలో చోటు చేసుకుంది. శనివారం ఉదయం ఎమ్మెల్సీ కవిత రోడ్‌ షోలో పాల్గొన్నారు. జగిత్యాల బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సంజయ్‌ కుమార్‌ కు మద్దతుగా ఆమె ప్రచార వాహనంపై నిలబడి ప్రసంగించారు. అయితే  ఈ క్రమంలో ప్రచార వాహనంపైనే ఉన్న కవిత అకస్మాత్తుగా  కళ్లుతిరిగి పడిపోయారు. దీంతో అందరూ ఆందోళన చెందారు.  వెంటనే బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కాగా అక్కడే ఉన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ ఆమెకు  ప్రాథమిక చికిత్స అందించారు. అయితే అస్వస్థతకు గురైనప్పటికీ కవిత వెంటనే తిరిగి కోలుకున్నారు. విశ్రాంతి తీసుకోవాలని కార్యకర్తలు వారించినా ఆమె ప్రచారం చేసేందుకే కదిలారు. కాసేపటికే ఆమె  తిరిగి ప్రచారం ప్రారంభించారు. డీహైడ్రేషన్ వల్ల ఎమ్మెల్సీ కవిత స్పల్ప అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు.

Telangana Rashtra Samithi leader K Kavitha. (Credits: Facebook)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Bank Holidays in 2025: బ్యాంక్ సెలవుల జాబితా 2025 ఇదిగో, పండుగల నుండి జాతీయ సెలవులు వరకు బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాను తెలుసుకోండి

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన

CM Revanth Reddy: తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం