BRS MLC Kavitha Arrest: మనీలాండరింగ్ హవాలా చట్టం కింద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్, కవిత భర్త అనిల్ కుమార్ కు సమాచారం ఇచ్చామని తెలిపిన ఈడీ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మనీలాండరింగ్ హవాలా చట్టం కింద అరెస్ట్ చేశామని ఈడీ అధికారులు తెలిపారు. ఢిల్లీ మద్యం కేసులో ఈ రోజు మధ్యాహ్నం నుంచి దాదాపు ఐదు గంటల పాటు ఆమెను విచారించిన ఈడీ అధికారులు సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు.

BRS MLC Kavitha arrested under Money Laundering Hawala Act Says ED

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మనీలాండరింగ్ హవాలా చట్టం కింద అరెస్ట్ చేశామని ఈడీ అధికారులు తెలిపారు. ఢిల్లీ మద్యం కేసులో ఈ రోజు మధ్యాహ్నం నుంచి దాదాపు ఐదు గంటల పాటు ఆమెను విచారించిన ఈడీ అధికారులు సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్‌కు సంబంధించి కవిత భర్త అనిల్ కుమార్ కు సమాచారం అందించినట్లు పేర్కొంది. 14 పేజీల అరెస్ట్ సమాచారాన్ని భర్తకు ఇచ్చామని వెల్లడించింది. ఈ మేరకు అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ పేరుతో ఈడీ... కవిత భర్తకు సమాచారం ఇచ్చింది. బంజారాహిల్స్‌లోని కవిత నివాసంలోనే అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. కాగా కవితను రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తీసుకువెళుతున్నారు. రాత్రి ఈడీ కార్యాలయంలోనే విచారించే అవకాశముంది.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement