C P Radhakrishnan: తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్, పూర్తిస్థాయి గవర్నర్ నియామకం జరిగేదాకా బాధ్యతలు చేపట్టనున్న బీజేపీ మాజీ చీఫ్
తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేయగా దానిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దీంతో తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం జరగాల్సి ఉన్న నేపథ్యంలో.. జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ బాధ్యతలను అదనంగా అప్పజెప్పారు
తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేయగా దానిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దీంతో తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం జరగాల్సి ఉన్న నేపథ్యంలో.. జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ బాధ్యతలను అదనంగా అప్పజెప్పారు.తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణకు పూర్తిస్థాయి గవర్నర్ నియామకం జరిగేదాకా సీపీ రాధాకృష్ణన్ గవర్నర్‌గా కొనసాగనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా, వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లుగా వార్తలు
తమిళనాడుకు చెందిన బీజేపీ మాజీ చీఫ్ సీపీ రాధాకృష్ణన్..1998, 99 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున కోయంబత్తూరు నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. తమిళనాడులో బీజేపీ బలపడేందుకు ఎన్నో పోరాటాలు చేశారు.బీజేపీ తరఫున ఆయన పలు కీలక పదవులు నిర్వహించారు. కిందటి ఏడాది ఫిబ్రవరిలో ఆయన జార్ఖండ్‌కు గవర్నర్‌గా నియమితులయ్యారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)