Independence Day 2024: తెలంగాణ పోలిస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ చదువు యాదయ్యకు రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డ్‌, ఎందుకు ప్రదానం చేశారంటే..

తెలంగాణ పోలిస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ చదువు యాదయ్యకు ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ గ్యాలంటరీ (పీఎంజీ) అవార్డ్‌ను అందిస్తున్నట్లు తెలిపింది.ఈ రాష్ట్రపతి అవార్డ్‌ను దేశం మొత్తంలో ఒకే ఒక్క పోలీస్‌ అధికారి యాదయ్యకు దక్కడం విశేషం

Chaduvu Yadaiah, Head Constable of Telangana Police (Photo Credits: PIB)

భారత 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశంలో 1037 మంది పోలీస్, ఫైర్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీసెస్ సిబ్బందికి గ్యాలంటరీ, సర్వీస్ మెడల్స్‌ అందించనుంది. ఈ మేరకు అవార్డ్‌ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణ పోలిస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ చదువు యాదయ్యకు ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ గ్యాలంటరీ (పీఎంజీ) అవార్డ్‌ను అందిస్తున్నట్లు తెలిపింది.ఈ రాష్ట్రపతి అవార్డ్‌ను దేశం మొత్తంలో ఒకే ఒక్క పోలీస్‌ అధికారి యాదయ్యకు దక్కడం విశేషం  హర్‌ ఘర్ తిరంగా సర్టిఫికెట్‌ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి, అయితే మీ ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

తెలంగాణలో ఇషాన్‌ నిరంజన్‌ నీలంపల్లి, రాహుల్‌ అనే ఇద్దరు దొంగలు చైన్‌ స్నాచింగ్‌లు, అక్రమ ఆయుధాల సరఫరా చేసేవారు. అయితే వీళ్లిద్దరూ జూన్‌ 25,2022న దోపిడీకి పాల్పడ్డారు. ఆ మరుసటి సమాచారం అందుకున్న సైబరాబాద్‌ పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ చదువు యాదయ్య పట్టుకున్నారు. యాదయ్య నుంచి తప్పించునేందుకు నిందితులు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో యాదయ్యపై దారుణంగా కత్తితో పలు మార్లు దాడి చేశారు. అయినప్పటికీ యాదయ్య వెనక్కి తగ్గలేదు. ప్రాణాల్ని ఫణంగా పెట్టి నిందితుల్ని పట్టుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ యాదయ్య 17 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆయన ధైర్య సహాసాల్ని కేంద్రం కొనియాడింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్యాలంటరీ అవార్డ్‌ను ప్రధానం చేస్తున్నట్లు ప్రకటించింది

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Corbin Bosch Creates History: పాకిస్థాన్ పై మ్యాచ్ లో చెల‌రేగిన ఆట‌గాడు, అరంగేట్రంలోనే అద‌ర‌గొట్టి స‌రికొత్త రికార్డు సృష్టించిన సౌతాఫ్రికా క్రికెట‌ర్

Manmohan Singh Funeral Ceremony: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ నేతలు, తెలంగాణతో మన్మోహన్‌కు ప్రత్యేక అనుబంధం ఉందన్న కేసీఆర్, ప్రతి సందర్భంలో మనోధైర్యం నింపారని వెల్లడి

Weather Forecast: ఏపీ వెదర్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరిక, తెలంగాలో పెరుగుతున్న చలి

Telangana Shocker: పోలీసుల వేధింపులు..పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్మహత్య, తండ్రి తీసుకున్న డబ్బులకు తనను వేధించడంపై మనస్తాపం..సూసైడ్, నాచారంలో విషాదం