Rajiv Gandhi’s Statue in Hyd: సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు, శంకుస్థాపన కార్యక్రమం చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ చేత విగ్రహావిష్కరణ
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఒక పక్క అంబేద్కర్, మరోపక్క ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, జైపాల్ రెడ్డి విగ్రహాలు ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఉన్నాయని తెలిపారు.
తెలంగాణ సచివాలయం ఎదురుగా స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఒక పక్క అంబేద్కర్, మరోపక్క ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, జైపాల్ రెడ్డి విగ్రహాలు ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఉన్నాయని తెలిపారు. కానీ ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం లేని లోటు స్పష్టంగా కనిపించిందన్నారు. దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. టెలికాం రంగంలో మహా నేత రాజీవ్ గాంధీ విప్లవాత్మక మార్పు తెచ్చారని అన్నారు. ఇది చరిత్రలో నిలిచిపోయే సందర్భమని తెలిపారు.విగ్రహావిష్కరణకు ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీని ఆహ్వానిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Here's CMO Tweet