CM Revanth Reddy: ఉస్మానియా జనరల్ ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి, గోషామహల్‌లో 26 ఎకరాల్లో నిర్మాణం

హైదరాబాద్ గోషామహల్‌లో ఉస్మానియా ఆసుపత్రి(Osmania General Hospital) నూతన భవనానికి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).

CM Revanth Reddy lay foundation stone for Osmania General Hospital(X)

హైదరాబాద్ గోషామహల్‌లో ఉస్మానియా ఆసుపత్రి(Osmania General Hospital) నూతన భవనానికి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.

ప్ర‌స్తుతం ఉస్మానియా ఆసుప‌త్రి అఫ్జ‌ల్‌గంజ్‌లో ఉండ‌గా కొత్త ఆసుపత్రిని గోషామ‌హ‌ల్ స్టేడియంలో(Goshamahal Stadium) నిర్మించ‌నున్నారు. 2 వేల ప‌డ‌క‌ల సామ‌ర్ధ్యంతో మొత్తం 32 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో నూత‌న ఆసుప‌త్రిని నిర్మించ‌నున్నారు.

26 ఎక‌రాల విస్తీర్ణంలో నిర్మించ‌నుండగా అన్నిరకాల సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్ర‌తి డిపార్ట్‌మెంట్‌కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్‌కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ వార్డులు, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఒకే చోట అన్నిరకాల డయాగ్నసిస్‌ సేవలు, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చురీ, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్‌ కూడిన ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ యూనిట్ల‌కు రూప‌క‌ల్ప‌న చేశారు.   తెలంగాణ వైద్యారోగ్య చరిత్రలో నవశకం.. ఉస్మానియా ఆస్పత్రికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ, 26 ఎకరాల్లో 2 వేల పడకల సామర్థ్యంతో ఆస్పత్రి నిర్మాణం, వివరాలివే 

CM Revanth Reddy lay foundation stone for Osmania General Hospital

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now