Colonel Santosh Babu: కల్నల్‌ సంతోష్‌బాబుకు మహావీర్‌చక్ర పురస్కారం, భారత్‌-చైనా సరిహద్దులోని గాల్వాన్‌ లోయలో వీర మరణం పొందిన తెలంగాణ బిడ్డ

Mahavir Chakra Accorded to Colonel Santosh Babu. (Photo Credits: ANI)

భారత్‌-చైనా సరిహద్దులోని గాల్వాన్‌ లోయలో వీర మరణం పొందిన భరతమాత ముద్దుబిడ్డ కల్నల్‌ బిక్కమల్ల సంతోష్‌బాబుకు(37) మహావీర్‌చక్ర పురస్కారం లభించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా సంతోష్‌ భార్య, తల్లి ఈ అవార్డును స్వీకరించారు. కాగా యుద్ధ సమయాల్లో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు రెండో అత్యున్నత పురస్కారంగా మహావీర్ చక్రను అందజేస్తారు.

భారత్, చైనా సైనికుల మధ్య తూర్పు లద్దాఖ్‌లోని గాల్వాన్ లోయ ప్రాంతంలో 2020 జూన్ 15వ తేదీ రాత్రి జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది బిహార్ రెజిమెంట్‌కు చెందినవారు. 16-బిహార్ రెజిమెంట్‌లో కమాండింగ్ ఆఫీసర్ సంతోష్ బాబు నేతృత్వం వహిస్తున్న దళంతోనే గల్వాన్ లోయలో చైనా సైనికులు ఘర్షణకు దిగారు. సంతోష్ బాబుది తెలంగాణలోని సూర్యాపేట. సంతోష్ 1982లో జన్మించారు. సంతోష్ బాబుకు భార్య మంజుల, కూతురు అభిజ్ఞ, కుమారుడు అనిరుధ్ ఉన్నారు. ఆయన చైనా సరిహద్దుల్లో ఏడాదిన్నరగా విధుల్లో ఉన్నారు.