Jupally Krishna Rao: కేసీఆర్ కుటుంబం తెలంగాణ అమరుల రక్తపు కూడు తింటోంది: జూపల్లి
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్లా పోటీకి దిగడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటమిని ముందే అంగీకరించారని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు.
Hyderabad, Aug 23: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) రెండు చోట్లా పోటీకి దిగడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తన ఓటమిని ముందే అంగీకరించారని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) విమర్శించారు. గత ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీలను అమలు చేయని కేసీఆర్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమల కొండపై మాట్లాడిన మైనంపల్లి హన్మంతరావు, పట్నం మహేందర్‌రెడ్డి తమ దెబ్బ ఎలా ఉంటుందో కేసీఆర్‌కు దిమ్మదిరిగేలా చూపించాలని అన్నారు. టికెట్ల కోసం తాము కొట్టుకోవడం పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యానికి నిదర్శనమని అన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ అమరుల రక్తపు కూడు తింటోందని ధ్వజమెత్తారు.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)