Jeevan Reddy Follower Killed: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడి దారుణ హత్య.. పోలీసులపై మండిపడ్డ కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి(53) దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
Hyderabad, Oct 22: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు (Congress MLC Jeevan Reddy follower brutally killed) మారు గంగారెడ్డి(53) దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లాలోని జాబితాపూర్ శివారులో గంగారెడ్డి దారుణ హత్య కు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు కారుతో (Car) ఢీకొట్టి కత్తితో పొడిచి ఆయన్ని చంపినట్టు స్థానికులు చెబుతున్నారు. హత్య చేసిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిరసన చేస్తున్నారు. అధికార పార్టీ నేతల పరిస్థితే ఇలా ఉంటే పరిస్థితి ఏంటని పోలీసులపై జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఈ సంఘటన కేసు నమోదు చేసుకున్న పోలీసులు…లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)