Corona Cases in Hyderabad: హైదరాబాద్ లో 10కి చేరిన కరోనా కేసులు.. గురువారం ఒక్కరోజే 4 కేసులు నమోదు.. అందుబాటులోకి ఆర్టీపీసీఆర్‌, ర్యాపిడ్‌ టెస్టులు

గడిచిన రెండు రోజుల్లో హైదరాబాద్ లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10కి చేరింది. ఈ నెల 20న 6 కేసులు నమోదు కాగా, తాజాగా గురువారం మరో 4 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

Hyderabad, Dec 22: గడిచిన రెండు రోజుల్లో హైదరాబాద్ (Hyderabad) లో కరోనా (Corona) పాజిటివ్‌ కేసుల (Positive Cases) సంఖ్య 10కి చేరింది. ఈ నెల 20న 6 కేసులు నమోదు కాగా, తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 4 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య పదికి చేరింది. కేసులు పెరుగుతున్న దృష్ట్యా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ముందస్తు చర్యలు ప్రారంభించారు. నగర పరిధిలోని అన్ని యూపీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా దవాఖానలతోపాటు ఉస్మానియా, గాంధీ, నల్లకుంట ఫీవర్‌ హాస్పిటల్‌, ఎర్రగడ్డ చాతి దవాఖాన వంటి టీచింగ్‌ హాస్పిటళ్లలోనూ ఆర్టీపీసీఆర్‌, ర్యాపిడ్‌ టెస్టుల వంటి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వైద్యాధికారులు వెల్లడించారు. కరోనా లక్షణాలున్నట్లు అనుమానం ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Gas Cylinder at Rs 500: రూ.500 వంట గ్యాస్ సిలిండర్‌ పై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు.. ఎల్పీజీ డీలర్స్ అసోసియేషన్

Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now