TS Night Curfew : తెలంగాణలో నేటి నుంచి ఏప్రిల్ 30 వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూ, రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ నిబంధనలు, అత్యసవర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు

కోవిడ్‌-19 నియంత్రణ చర్యల్లో భాగంగా రాత్రి కర్ఫ్యూ (Night Curfew in TS) విధించింది. నేటి నుంచి ఈ నెల 30 వరకు వరకు నైట్‌ కర్ఫ్యూ (night curfew) నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ జీవోను జారీ చేసింది.

An empty street near Charminar, Hyderabad. | Photo Credits: ANI

రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొంది. అత్యసవర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపునిస్తున్నట్లు తెలిపింది. రాత్రి 8 గంటల వరకే రెస్టారెంట్లు, బార్లు, పబ్‌లు, క్లబ్‌లు, షాపులకు అనుమతి ఉంటుందని.. ఆ తర్వాత ఎక్కడైనా షాపు ఓపెన్ చేసినట్లు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అయితే.. కర్ఫ్యూ నుంచి ఆస్పత్రులు, డయోగ్నస్టిక్, మెడికల్ షాపులతో పాటు అత్యవసర సేవలకు మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుంది. క‌ర్ఫ్యూ నుంచి అత్య‌వ‌స‌ర స‌ర్వీసులు, పెట్రోల్ బంక్‌లు, మీడియాకు మిన‌హాయింపు ఇచ్చారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోనున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)