#PoliceFlagDay: అమరుడైన హోం గార్డు లింగయ్య తల్లికి పాదాభివందనం చేసిన రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్, వీడియోని ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన కమిషనరేట్
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి కుటుంబాలను మహేశ్ భగవత్ సత్కరించారు.
రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ ఓ హోం గార్డు తల్లికి పాదాభివందనం చేసిన దృశ్యాలకు సంబంధించని వీడియోను ఆ కమిషనరేట్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి కుటుంబాలను మహేశ్ భగవత్ సత్కరించారు. అంబర్‌పేట్ కార్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హోంగార్డు లింగయ్య తల్లి సారమ్మ పాల్గొంది. ఈ నేపథ్యంలో ఆమెకు మహేశ్ భగవత్ పాదాభివందనం చేశారు. కాగా, 2015లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆత్మకూర్ పరిధిలోని సిమీ ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు పోలీసులతో పాటు హోంగార్డు లింగయ్య అమరులయ్యారు. వారందరికీ పోలీసులు నివాళులు అర్పించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)