Free Ambulance Service: హైదరాబాద్‌లో ఉచిత అంబులెన్స్‌ సర్వీసులు, సైబరాబాద్‌ పోలీస్, ఐటీ కంపెనీల సంయుక్తాధ్వర్యంలో సేవలు, 12 ఉచిత అంబులెన్స్‌లను ప్రారంభించిన సీపీ సజ్జనార్‌

సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సైబరాబాద్‌ పోలీసులు, ఐటీ కంపెనీల సంయుక్తాధ్వర్యంలో శనివారం 12 ఉచిత అంబులెన్స్‌లను (Free Ambulance Service) సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన (CP Sajjanar) మాట్లాడుతూ.. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో అంబులెన్స్‌ ఆపరేటర్లు ఎక్కువ డబ్బులు డిమాండ్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Cyberabad CP VC Sajjanar | Photo: ANI

గర్భిణులు, చిన్నారులు, గుండె జబ్బులు ఉన్నవారు, డయాలసిస్‌ పేషెంట్ల కోసం అందుబాటులో అంబులెన్స్‌లు ఉంటాయన్నారు. సైబరాబాద్‌తో పాటు హైదరాబాద్, రాచకొండ కమిషరేట్‌లలో ఉచితంగా సేవలందిస్తాయని తెలిపారు. రహేజా మైండ్‌ స్పేస్, దివ్యశ్రీ ఓరియన్, ఫినిక్స్, వేవ్‌రాక్, గార్గ్‌ కార్పొరేషన్, అసెండాస్, టీసీఎస్, గుగూల్, డీఎల్‌ఎఫ్‌ సహకారంతో అంబులెన్స్‌ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నంబర్‌తో పాటు అంబులెన్స్‌ల కోసం 94906 17440, 94906 17431లను సంప్రదించాలన్నారు. 24 గంటల పాటు సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now