Cyberabad Traffic Police: నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే బాగుంటావ్ నాన్న.. బండి నడిపేటప్పుడు కూడా పెట్టుకో నాన్న, ట్రాఫిక్ రూల్స్ గురించి సరికొత్తగా ప్రచారం చేస్తున్న సైబరాబాద్ పోలీసులు
సైబరాబాద్ పోలీసులు కొత్తగా ముందుకు వెళుతున్నారు. సినిమా పోస్టర్లను వాడుకుంటూ ట్రాఫిక్ మీద ప్రతి ఒక్కరికీ పోలీసులు (Cyberabad Traffic Police) అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని జెర్సీ మూవీని (Awareness With Using Jersey Poster) వాడుకున్నారు. ఇందులో క్రికెటర్‌గా దర్శనమిచ్చిన నాని ఫీల్డ్‌లో బ్యాట్ పట్టుకుని ముఖాన హెల్మెట్ పట్టుకుని ఏ ఫోరో, సిక్సరో బాదడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుండగా మరో ఫొటోలో హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్నాడు. ఇది చూసిన అతడి కొడుకు గౌతమ్.. "నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే బాగుంటావ్ నాన్న.. బండి నడిపేటప్పుడు కూడా పెట్టుకో నాన్న" అని సలహా ఇస్తున్నట్లుగా ఉంది. పనిలో పనిగా జాతీయ అవార్డు అందుకున్నందుకు జెర్సీ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలే చావు కబురు చల్లగా పోస్టర్‌ను కూడా ఫుల్‌గా వాడుకున్నారు. హెల్మెట్ పెట్టుకోండి బస్తీ బాలరాజు గారూ.. ఎలాంటి కబురు వినాల్సిన అవసరం లేదు.. అని మీమ్ షేర్ చేసిన విషయం తెలిసిందే!
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)