Harish Rao Meets Kavitha: వీడియో ఇదిగో, తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రి హరీష్ రావు ములాఖాత్, ధైర్యంగా ఉండాలని సూచన

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Case)లో అరెస్టు అయి తిహార్ జైల్లో (Tihad Jail) ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha)తో శుక్రవారం ఉదయం ఆయన భేటీ అయ్యారు.

BRS leader Harish Rao meets MLC Kavitha in Tihar jail

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Case)లో అరెస్టు అయి తిహార్ జైల్లో (Tihad Jail) ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha)తో శుక్రవారం ఉదయం ఆయన భేటీ అయ్యారు. ములాఖాత్ (Mulakat) సందర్భంగా ఎమ్మెల్సీ కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండమని ఆయన కవితను సూచించారు. అధికారులు బెల్ట్ తీసుకోవడంతో నా ఫ్యాంట్ పదే పదే జారిపోతోంది, కోర్టుకు విన్నవించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కోర్టు ఏమన్నదంటే..

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్‌ అయి తిహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్‌ కస్టడీని జూలై 5 వరకు పొడిగిస్తూ న్యాయస్థానం శుక్రవారం (జూన్ 21వ తేదీ) ఆదేశాలిచ్చింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను మార్చి 15న అరెస్టు చేశారు. జైలులో ఉన్న కవితను సీబీఐ ఏప్రిల్‌ 11న అరెస్టు చేసింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now