DGP Anjani Kumar Suspension Revoked: డీజీపీ అంజనీకుమార్ సస్పెన్షన్‌ను ఎత్తివేసిన ఈసీ, తాను ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించలేదని సీఈసీకి విజ్ఞప్తి చేసిన ఐపీఎస్‌ అధికారి

DGP-Anjani-Kumar Meet Revanth Reddy (photo-Video Grab)

తెలంగాణ ఐపీఎస్‌ అధికారి అంజనీకుమార్‌పై ఉన్న సస్పెన్షన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తివేసింది. అంజనీకుమార్‌ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీఈసీ.. సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్టు తెలిపింది. ఎన్నికల కౌంటింగ్‌ రోజున తాను ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించలేదని అంజనీకుమార్‌ సీఈసీకి విజ్ఞప్తి చేశారు. . ఎన్నికల రోజున సీఎం రేవంత్‌ రెడ్డి పిలిస్తేనే తాను ఆయన ఇంటికి వెళ్లినట్టు అంజనీకుమార్‌ స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావని ఆయన చెప్పారు. దీంతో, ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీఈసీ.. సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్టు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది.  రేవంత్‌రెడ్డితో భేటీ అయిన కొద్ది సేపటికే డీజీపీ అంజనీకుమార్‌ సస్పెండ్‌, ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగానే కలవడంపై ఈసీ సీరియస్

Here's News

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement