తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ను ఈసీ సస్పెండ్‌ చేసినట్లు పీటీఐ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగానే అధికారికంగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో సంప్రదింపులు జరపడమే అంజనీకుమార్‌ సస్పెన్షన్‌కు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిని పూల బొకేతో కలవడంతో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందకే రావడంతో డీజీపీ అంజనీకుమార్‌పై వేటుకు కారణమైంది. డీజీపీతో పాటు అదనపు డీజీలు మహేష్‌ భగవత్‌, సంజయ్‌ జైన్‌లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది ఈసీ. డీజీపీ అంజనీ కుమార్‌ను సస్పెండ్‌ చేసిన నేపథ్యంలో తదుపరి డీజీపీగా జితేందర్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూకుడు, రేవంత్ రెడ్డితో భేటీ అయిన తెలంగాణ డీజీపీ అంజనీకుమార్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, వీడియో ఇదిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)