Telangana: పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణిపై భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు దారుణం, గవర్నమెంట్ ఆసుపత్రిలోనే నొప్పి వస్తుందా? అంటూ..

భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు డెలివరీ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారు వైద్యులు. డెలివరీ చేయడానికి లంచాలు అడుగుతున్న సిబ్బంది. ఆసుపత్రిలో పురిటి నొప్పులు భరించలేకపోతున్నామని వేడుకున్నా కనికరం చూపడం లేదు వైద్యులు.

Doctors at Bhadrachalam Government Hospital are causing difficulties for pregnant women by not delivering them

భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు డెలివరీ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారు వైద్యులు. డెలివరీ చేయడానికి లంచాలు అడుగుతున్న సిబ్బంది. ఆసుపత్రిలో పురిటి నొప్పులు భరించలేకపోతున్నామని వేడుకున్నా కనికరం చూపడం లేదు వైద్యులు. ప్రైవేట్ ఆసుపత్రిలో డెలివరీ చేసుకుంటే నొప్పి రాదా.. గవర్నమెంట్ ఆసుపత్రిలోనే నొప్పి వస్తుందా? అంటూ సూటిపోటి మాటలతో వేధింపులకు గురిచేస్తున్నారు.

సికింద్రాబాద్‌లోని మెట్టుగూడలో దారుణం.. బైక్‌పై వెళ్తున్న తల్లి, కొడుకులపై కత్తితో దాడి చేసిన దుండగులు, వీడియో ఇదిగో

సినిమాలు ఎక్కువగా చూస్తావా.. డైలాగులు చెప్తున్నావంటూ గర్భిణీ స్త్రీని టార్చర్ పెట్టిన వైద్యులు. నొప్పి గవర్నమెంట్ ఆసుపత్రిలోనే వస్తుందా.. అయితే ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకో అని గర్భిణులను తిడుతున్న డాక్టర్లు. బిడ్డ బయటకు వచ్చే సమయంలో నొప్పిని భరించలేక వేడుకున్న గర్భిణీని మొదటి కాన్పు ప్రైవేట్ ఆసుపత్రిలో చూసుకున్నావా? అక్కడ నొప్పులు రాలేదా? సినిమాలు ఎక్కువ చూస్తావా, డైలాగులు చెప్తున్నావు అంటూ వ్యంగ్యంగా మాట్లాడిన వైద్యురాలు ప్రమీలారాణి

కాన్పు అయ్యాక బిడ్డను పక్కన పడేసారు.. ఆ తర్వాత ఎవరూ మమ్మల్ని పట్టించుకోలేదు.. రిజిస్టర్లో మా పేర్లు కూడా తప్పుగా రాశారంటూ, పేర్లు సరిచేయమంటే లంచం అడుగుతున్నారని, రోగులకు నీళ్ల పాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది బాలింత.

పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణిపై  భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు దారుణం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now