Hyderabad: చనిపోతూ ఐదుగురికి ప్రాణం పోసిన డాక్టర్ భూమిక.. బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవాలు దానం చేసిన తల్లిదండ్రులు, శోకసంద్రంలో మునిగిన తల్లిదండ్రులు
తను చనిపోతూ ఐదుగురికి ప్రాణం పోశారు డాక్టర్ భూమిక. రంగారెడ్డి - హైదరాబాద్ (Hyderabad) కామినేని ఆసుపత్రిలో హౌజ్ సర్జన్‌గా పని చేస్తున్న
తను చనిపోతూ ఐదుగురికి ప్రాణం పోశారు డాక్టర్ భూమిక. రంగారెడ్డి - హైదరాబాద్ (Hyderabad) కామినేని ఆసుపత్రిలో హౌజ్ సర్జన్‌గా పని చేస్తున్న భూమిక తన స్నేహితుడు యశ్వంత్‌తో కలిసి ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
రోడ్డు ప్రమాదంలో వైద్యుడు యశ్వంత్ మృతి చెందగా తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు వైద్యురాలు భూమిక(Bhumikha). ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కాగా.. తన అవయవాలు దానం చేశారు తల్లిదండ్రులు.
గుండె, లీవర్, ఐస్, కిడ్నిన్స్ దానం చేశారు తల్లిదండ్రులు. భూమిక మృతితో ఆమె తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. అవయవ దానం చేసిన భూమిక మృతదేహానికి ఘనంగా నివాళులు అర్పించింది ఆసుపత్రి సిబ్బంది. నలుగురికి ప్రాణాలు పొసిన భూమిక.. అమర్ హై అంటూ నినాదాలు చేసి కన్నీరు పెట్టుకుంది ఆసుపత్రి సిబ్బంది, కుటుంబసభ్యులు.
Dr. Bhoomika Parents Donate Her Organs After Brain Death