Hyderabad: వీడియో ఇదిగో, తాగిన మత్తులో దొంగతనానికి వచ్చి ఫ్లైఓవర్ పైనుంచి దూకిన మందుబాబు, తీవ్ర గాయాలు, ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు
రాడ్లు దొంగతనం చేస్తుండగా నిర్మాణ కూలీలు అది గమనించి కేకులు వేయడంతో కంగారుపడిన రాములు ఫ్లైఓవర్ పైనుంచి కిందికి దూకాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో.. అతన్ని చికిత్స నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్ - ఫలక్‌నుమాకు చెందిన రాములు (55) అనే వ్యక్తి మధ్యాహ్నం దాదాపు రెండు గంటల సమయంలో మద్యం సేవించి అంబర్‌పేట శ్రీ రమణ చౌరస్తా సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద ఉన్న ఇనుప రాడ్లు దొంగతనం చేయడానికి వచ్చాడు . అయితే రాడ్లు దొంగతనం చేస్తుండగా నిర్మాణ కూలీలు అది గమనించి కేకులు వేయడంతో కంగారుపడిన రాములు ఫ్లైఓవర్ పైనుంచి కిందికి దూకాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో.. అతన్ని చికిత్స నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
దొంగతనానికి వచ్చి ఫ్లైఓవర్ పైనుంచి దూకిన మందుబాబు
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)