Hyderabad: వీడియోలు ఇవిగో, పుల్లుగా మద్యం తాగి రోడ్డు మీద కారుతో యువతులు హల్‌చల్, బైకర్‌ని ఢీకొట్టి అతనితో గొడవ, పోలీసులు వచ్చిన తర్వాత ఏమైందంటే..
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో యువతులు మద్యం మత్తులో హల్‌చల్ చేశారు. రహదారిపై మద్యంమత్తులో కారు నడుపుతూ బీభత్సం సృష్టించారు. కేబీహెచ్‌బీ మెట్రో స్టేషన్ వద్ద ఓ బైకును ఢీకొట్టిన యువతులు.. ఆపై అతనితో గొడవకు దిగారు. బైకర్‌ను బెదిరించడంతో అతడు ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించాడు

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో యువతులు మద్యం మత్తులో హల్‌చల్ చేశారు. రహదారిపై మద్యంమత్తులో కారు నడుపుతూ బీభత్సం సృష్టించారు. కేబీహెచ్‌బీ మెట్రో స్టేషన్ వద్ద ఓ బైకును ఢీకొట్టిన యువతులు.. ఆపై అతనితో గొడవకు దిగారు. బైకర్‌ను బెదిరించడంతో అతడు ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కారు నడుపుతున్న యువతికి బ్రీత్ అనలైజర్‌తో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేయగా 212 పాయింట్లు నమోదయింది. దీంతో మద్యం తాగినట్లు నిర్ధారించారు. కారులో డ్రైవింగ్ చేస్తున్న యువతితోపాటు మరికొందరు ఫుల్లుగా మద్యం సేవించినట్లు తెలిపారు. కారులో బీర్ క్యాన్లను గుర్తించామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Drunk women create havoc with car influence of Alcohol in Hyderabad KPHB Metro Station
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)