Bharadwaja Thammareddy: వీడియో ఇదిగో, ఆయన ఇగో వల్ల టాలీవుడ్ అంతా సీఎం ముందు తలవంచాల్సి వచ్చింది, సంచలన వ్యాఖ్యలు చేసిన నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ

ఇది దురదృష్టకరం, కానీ తప్పు జరిగింది, తెలియక అతనిపై ఆరోపణలు వచ్చాయి, కానీ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి తెలిసి అబద్ధాలు చెబుతున్నారన్నారు.

Tammareddy Bharadwaja and Allu Arjun (photo-X)

పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ అల్లుఅర్జున్‌పై తీవ్రంగా మండిపడ్డారు. "ఒక వ్యక్తి యొక్క "ఇగో" కారణంగా మొత్తం తెలుగు చలనచిత్ర పరిశ్రమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు తలవంచవలసి వచ్చిందన్నారు. ఇది దురదృష్టకరం, కానీ తప్పు జరిగింది, తెలియక అతనిపై ఆరోపణలు వచ్చాయి, కానీ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి తెలిసి అబద్ధాలు చెబుతున్నారన్నారు.

హీరోలు ఎక్కడికి వెళ్లినా నాలుగు కార్లలో వెళ్లాలని, రోడ్ షో చేయాలని భావిస్తున్నారని, ఈ మధ్య కాలంలో ఇలాంటివి సర్వ సాధారణంగా మారిపోయాయని విమర్శించారు. సైలెంట్‌గా వెళ్లి సినిమా చూసి వచ్చేస్తే ఇలాంటి ఘటనలు జరగడానికి ఆస్కారం ఉండదని అభిప్రాయపడ్డారు.

ఆన్‌లైన్‌లో విచారణకు హాజరైన అల్లు అర్జున్, జ్యూడీషియల్ రిమాండ్‌పై విచారణ జనవరి 10కి వాయిదా, బెయిల్ పిటిషన్‌ను సోమవారం విచారణ చేపట్టనున్న న్యాయస్థానం

గతంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలు కూడా అభిమానులతో కలిసి సినిమాలు చూసేందుకు వెళ్లేవారని, కాకపోతే వారు తగిన జాగ్రత్తలు తీసుకునే వారని గుర్తుచేశారు. వారు సైలెంట్‌గా ఏదో ఒక మల్టిప్లెక్స్‌కు వెళ్లి సినిమా చూసేవారని, బయటకు వచ్చే సమయంలో అక్కడున్న వారితో కాసేపు ముచ్చటించేవారని తెలిపారు. సింగిల్ స్క్రీన్ థియేటర్‌కు వెళ్లాల్సి వచ్చినా ఇదే ఫాలో అయ్యేవారని తెలిపారు.

Tammareddy Bharadwaja on Allu Arjun

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)