Electric AC Bus: నేటి నుంచే హైదరాబాద్ నుంచి విజయవాడకు ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు, ప్రతి 20 నిమిషాలకు ఒకటి చొప్పున బస్సు

రాష్ట్రంలో పర్యావరణహితమైన ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను ‘ఈ–గరుడ’ పేరుతో నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్రతి 20 నిమిషాలకు ఒకటి చొప్పున ఈ బస్సులను నడపనున్నా­రు.

Electric AC Bus (Photo-Twitter)

రాష్ట్రంలో పర్యావరణహితమైన ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను ‘ఈ–గరుడ’ పేరుతో నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్రతి 20 నిమిషాలకు ఒకటి చొప్పున ఈ బస్సులను నడపనున్నా­రు. మొదటి విడతగా 10 బస్సులను ప్రారంభించనున్నారు.మిగతా 40 బస్సులను ఈ ఏడాది చివరినాటికి దశలవారీగా ప్రవేశపెట్టనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌లో­ని మియాపూర్‌ క్రాస్‌రోడ్‌ సమీపంలోని పుష్పక్‌ బస్‌ పాయింట్‌ వద్ద మంగళవారం సాయంత్రం 5 గంటలకు జరిగే కార్యక్రమంలోరవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ జెండా ఊపి ఈ బస్సులను లాంఛనంగా ప్రారంభిస్తారు

News;

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement