Telangana Floods: మోరంచపల్లిలో ఇళ్లు పూర్తిగా నీటిలో ఎలా మునిగిపోయాయో చూడండి, దాదాపు 15 అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్న వాగు, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారిపై మోరంచ వద్ద సుమారు 15 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది.
తెలంగాణలో రెండు మూడురోజులుగా కురుస్తున్న జడివానకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. గ్రామ శివారులో ఉన్న వాగులోకి భారీగా వరద చేరడంతో గ్రామంలోకి ముంచెత్తింది. దీంతో ఇండ్లన్నీ నీటమునిగాయి. సమాచారం అందుకున్న అధికారులు గ్రామస్తులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు.
సహాయక బృందాలు గ్రామానికి చేరుకొని దాదాపు 200 మంది వరకు ప్రజలను సురక్షితంగా కాపాడారు. ముంపు ప్రాంతం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతానికి బోట్ల ద్వారా తరలించారు. అక్కడి నుంచి పునరావాస కేంద్రానికి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు తరలించాయి.
కాగా తెలంగాణలోని జయశంకర్ - భూపాలపల్లి జిల్లాలో 24 గంటల సమయంలో రికార్డు స్థాయిలో 600mm+ వర్షపాతం తర్వాత మోరంచపల్లె గ్రామంలో తీవ్ర వరద పరిస్థితి వీడియో ఇది. భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారిపై మోరంచ వద్ద సుమారు 15 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)