Fire Breaksout at Madhapur PS: మాదాపూర్ పీఎస్ లో మంటలు.. నిప్పురవ్వ ఎగిరి పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న ఓ సిలిండర్ పై పడటంతో ప్రమాదం
మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపిన వివరాల ప్రకారం… స్ట్రీట్ వెండర్స్ వద్ద తనిఖీల్లో సీజ్ చేసిన నాలుగు సిలిండర్లను పోలీస్‌స్టేషన్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో ఉంచారు.
Hyderabad, Jan 23: తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న సిలిండర్లు మాదాపూర్ పోలీస్ స్టేషన్ (Madhapur Policestation) లో పేలడం తీవ్ర కలకలం సృష్టించింది. మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపిన వివరాల ప్రకారం… స్ట్రీట్ వెండర్స్ వద్ద తనిఖీల్లో సీజ్ చేసిన నాలుగు సిలిండర్లను (Cylinders) పోలీస్‌స్టేషన్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో ఉంచారు. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మాదాపూర్ లో పోలీస్ స్టేషన్ సమీపంలో సోమవారం భక్తులు పటాకులు కాల్చారు. ఇందులో నుంచి చిన్న నిప్పురవ్వ ఎగిరి పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న ఓ సిలిండర్ పై పడి పేలింది. దీంతో మిగిలిన మూడు సిలిండర్లూ పేలాయి. పోలీస్ స్టేషన్ లో మంటలు చెలరేగడంతో పోలీస్ సిబ్బంది ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. హుటాహుటీన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేసుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)