Hyderabad Fire: వీడియో ఇదిగో, ఉప్పల్ సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం, భారీగా ఆస్తి నష్టం
హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతంలో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న, సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి సమయంలో ఒక్కసారిగా నాలుగంతస్తుల భవనంలోని ముందు భాగంలో మంటలు చెలరేగాయి
Uppal CMR Shopping Mall Fire Accident : హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతంలో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న, సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి సమయంలో ఒక్కసారిగా నాలుగంతస్తుల భవనంలోని ముందు భాగంలో మంటలు చెలరేగాయి. క్రమంగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో భవనం అగ్నికీలల్లో చిక్కుకుంది. నాలుగు ఫైరింజన్ల సాయంతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు.
షాప్ మూసివేసే సమయంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మూడంతస్తుల బిల్డింగ్‌లో బట్టలతో పాటు బంగారు అభరణాల షోరూం ఉంటుంది. అవన్నీ అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. అయితే జరిగిన నష్టంపై ఓ అంచనాకు రావాల్సి ఉంది. మెుత్తం నష్టం కోట్లలోనే ఉండనున్నట్లు సమాచారం. షార్ట్ సర్య్కూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు.ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)