Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలతో చేపల పండగ, నల్లగొండ - శాలిగౌరారం ప్రాజెక్టులో చిక్కిన 16 కిలోల భారీ చేప, షాక్ లో మత్స్యకారులు..
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఈ ఏడాది విజయవంతంగా పూర్తికావడంతో చెరువుల్లో మత్స్యకళను సంతరించుకొన్నాయి.
నిండా చేపలతో తెలంగాణలో చెరువులు ఉరకలు పెడుతున్నాయి. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఈ ఏడాది విజయవంతంగా పూర్తికావడంతో చెరువుల్లో మత్స్యకళను సంతరించుకొన్నాయి. సుమారు 5 నెలల పాటు సాగిన ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని రకాల జలవనరుల్లో అధికారులు చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసి, వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో 2016-17లో ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ ఏడాది వరకు పథకం కోసం ప్రభుత్వం మొత్తం రూ.415 కోట్లు ఖర్చు చేసింది. తాజాగా రెండు వారాలుగా పుష్కలంగా కురుస్తున్న వర్షాలతో నల్లగొండ - శాలిగౌరారం ప్రాజెక్టులో 16 కిలోల భారీ చేప చిక్కింది. దీంతో మత్స్యకారులు పండగ చేసుకుంటున్నారు.