Baby Dies in Stray Dogs Attack: హైదరాబాద్‌లో దారుణం, ఊయలో పడుకున్న 5 నెలల బాబుపై దాడి చేసిన వీధికుక్కలు, చికిత్స పొందుతూ బాబు మృతి

వీధి కుక్కల దాడిలో గాయపడిన బాబును కాపాడేందుకు వైద్యులు 17 రోజుల పాటు శ్రమించినా ఫలితం దక్కలేదు. నగరంలోని షేక్ పేటలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.

Representational Image (Credits: Istock)

హైదరాబాద్ లో వీధి కుక్కల దాడిలో 5 నెలల పసికందు ప్రాణాలు కోల్పోయాడు. వీధి కుక్కల దాడిలో గాయపడిన బాబును కాపాడేందుకు వైద్యులు 17 రోజుల పాటు శ్రమించినా ఫలితం దక్కలేదు. నగరంలోని షేక్ పేటలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. షేక్ పేటలోని ఓ గుడిసెలో ఉంటున్న అనూష, అంజి దంపతుల 5 నెలల కొడుకు శరత్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు.

ఈ నెల 8న శరత్ ను ఊయలలో పడుకోబెట్టి తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చాక బాబు గాయాలపాలై ఏడుస్తూ కనిపించాడు. దీంతో హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు నీలోఫర్ కు తీసుకెళ్లాలని సూచించారు. ఆపై నీలోఫర్ నుంచి మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాలుడిని కాపాడేందుకు వైద్యులు 17 రోజుల పాటు శ్రమించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. సోమవారం ఉదయం శరత్ కన్నుమూశాడు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)