Telangana JAC Again: తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్లీ ఉద్యోగ జేఏసీ, ఒకటో తేదీ జీతాలేవి?, రేవంత్ సర్కార్ పై పోరాటానికి ఉద్యోగులు రెడీ
తెలంగాణ ఉద్యమం తర్వాత ఉద్యోగ జేఏసీ మళ్లీ ఏర్పాటైంది. ఆ రోజు తెలంగాణ ఉద్యమం జేఏసీ ఏర్పాటు చేశాం.. ఇప్పుడు ప్రభుత్వంపై పోరాడడానికి జేఏసీ ఏర్పాటు చేస్తున్నాం అన్నారు ఉద్యోగులు. మేనిఫెస్టోలో పీఆర్సీ, టీఏ, డీఏ అని అన్నారు కానీ 9 నెలలు అయిన ఇంకా ఇవ్వలేదు.. ఇప్పటికీ 4 డీఏలు ఇవ్వలేదు అన్నారు.
Hyd, Aug 12: తెలంగాణ ఉద్యమం తర్వాత ఉద్యోగ జేఏసీ మళ్లీ ఏర్పాటైంది. ఆ రోజు తెలంగాణ ఉద్యమం జేఏసీ ఏర్పాటు చేశాం.. ఇప్పుడు ప్రభుత్వంపై పోరాడడానికి జేఏసీ ఏర్పాటు చేస్తున్నాం అన్నారు ఉద్యోగులు. మేనిఫెస్టోలో పీఆర్సీ, టీఏ, డీఏ అని అన్నారు కానీ 9 నెలలు అయిన ఇంకా ఇవ్వలేదు.. ఇప్పటికీ 4 డీఏలు ఇవ్వలేదు అన్నారు.
సీఎం మమ్మల్ని కలిసి, మా సమస్యలు పరిష్కరిస్తానన్నారు.. కానీ ఇప్పుడు ఆయన కలిసే పరిస్థితిలో లేడు, ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు అన్నారు.
ఒకటవ తేదీన జీతాలు అంటున్నారు, కానీ ఇంకా కొన్ని డిపార్ట్మెంట్ లకు ఒకటవ తేదీన జీతాలు రావట్లేదు అన్నారు. 15 రోజుల్లో మా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం.. మా ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని ఉద్యోగ జేఏసీ హెచ్చరించింది.
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)