Akula Lalitha Resigns to BRS: నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కి బిగ్ షాక్, రాజీనామా చేసిన మహిళ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఆకుల లలిత
నిజామాబాద్ జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీ కి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత తెలంగాణ మహిళ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఆకుల లలిత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ కు తన నాలుగు పేజీల రాజీనామా లేఖ రాశారు.
నిజామాబాద్ జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీ కి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత తెలంగాణ మహిళ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఆకుల లలిత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ కు తన నాలుగు పేజీల రాజీనామా లేఖ రాశారు. ఆకుల లలిత కాంగ్రెస్ పార్టిలో ఎంపీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఎంపీపీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా, పార్టి రాష్ట్ర అధ్యక్షురాలు లాంటి పదవులను నిర్వర్తించారు. 2018 లో అర్మూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటి చేసి ఓటమి పాలయ్యారు. అప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న ఆకుల లలిత బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కేటాయింపులో తనకు అర్బన్ స్థానం ఇవ్వాలని కోరారు. కానీ ఉమ్మడి జిల్లాలో సిట్టింగ్ లకు టికెట్ లను ఇవ్వడంతో అప్పటి నుంచి ఆకుల లలిత టికెట్ కోసం ఇతర పార్టీలో చేరేందుకు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ స్థాయిలో జరిగిన చర్చల నేపథ్యంలో ఆకుల లలిత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)