Free Bus Service For Women: తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ఎఫెక్ట్, బస్సు డ్రైవర్ మీద దాడి చేసిన ఆటో డ్రైవర్లు, ఉద్యోగం చేయలేనంటూ ఏడ్చేసిన మహిళా కండక్టర్

భద్రాచలం డిపోకు చెందిన బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కారు. డోర్ దగ్గర ఉన్న వారు లోపలికి రావాలని మహిళా కండక్టర్ చెప్పినా వినలేదు. ప్రభుత్వం తమకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిందని, కండక్టర్ అవసరం లేదని దుర్భాషలాడారు. దీంతో కండక్టర్ బస్సు దిగి, ఇక ఉద్యోగం చేయాలేనంటూ కన్నీరు పెట్టుకున్నారు.

Conductors are facing difficulties with RTC free bus scheme for women in Telangana

తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి విదితమే. దీనిపై చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నా అక్కడక్కడా కొన్ని బాధాకరమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ ఫ్రీ బస్సు పథకంతో కండక్టర్లు కష్టాలు పడుతున్న వీడియో బయటకు వచ్చింది. భద్రాచలం డిపోకు చెందిన బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కారు. డోర్ దగ్గర ఉన్న వారు లోపలికి రావాలని మహిళా కండక్టర్ చెప్పినా వినలేదు. ప్రభుత్వం తమకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిందని, కండక్టర్ అవసరం లేదని దుర్భాషలాడారు. దీంతో కండక్టర్ బస్సు దిగి, ఇక ఉద్యోగం చేయాలేనంటూ కన్నీరు పెట్టుకున్నారు. డోర్ దగ్గర ఉన్నవారు పడిపోతే బాధ్యత ఎవరు తీసుకుంటారని కన్నీటి పర్యంతం అయ్యారు.

ఇక కొత్తగూడెం డిపో నుంచి ఖమ్మం బయల్దేరిన పల్లెవెలుగు బస్సు పట్టణంలోని పోస్టాఫీస్ కూడలికి చేరుకుంది. అప్పటి వరకు స్థానిక సర్వీసు ఆటోల్లో వెళ్లామనుకున్న ప్రయాణికులంతా ఒక్కసారిగా బస్సెక్కారు. అదే సమయంలో అక్కడున్న నలుగురు ఆటోడ్రైవర్లు ఆవేశంతో బస్సు డ్రైవర్ నాగరాజుపై దాడిచేశారు. అతనిపై నీళ్లు చల్లుతూ అసభ్య పదజాలంతో దూషించారు. కండక్టర్ సరస్వతి, ప్రయాణికులు వారించే ప్రయత్నం చేసినా వారు ఆగలేదు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now