Gaddar Last Rites: బౌద్ధ మత ఆచారంలో ముగిసిన గద్దర్ అంత్యక్రియలు, ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అల్వాల్‌లోని మహాబోధి విద్యాలయ ఆవరణలో అంతిమ సంస్కారాలు పూర్తి
అల్వాల్‌లోని మహాబోధి స్కూల్ ఆవరణలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో బౌద్ధ సంప్రదాయం ప్రకారం పూర్తి చేశారు. బౌద్ధ మత ఆచారంలో గద్దర్ అంత్యక్రియలు నిర్వహించారు.
గద్దర్ అంత్యక్రియలు సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ముగిశాయి. అల్వాల్‌లోని మహాబోధి స్కూల్ ఆవరణలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో బౌద్ధ సంప్రదాయం ప్రకారం పూర్తి చేశారు. బౌద్ధ మత ఆచారంలో గద్దర్ అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు కడసారిగా గద్దర్‌ను చూసేందుకు ఎల్బీ స్టేడియానికి సినీ, రాజకీయ ప్రముఖులు, కళాకారులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉద్యమ వీరుడికి విప్లవ జోహార్లు సమర్పించారు.
ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి గన్‌పార్క్, అంబేడ్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపం, ట్యాంక్ బండ్ మీదుగా అల్వాల్ వరకు గద్దర్ అంతిమయాత్ర కొనసాగింది.కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్ ఆదివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)