Heavy Inflows Into Hussain Sagar: వీడియో ఇదిగో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న హుస్సేన్ సాగర్, భారీగా వచ్చి చేరుతున్న వరదనీరు, లోతట్టు ప్రాంతాలకు హెచ్చరిక
హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. ఈ రోజు సాయంత్రం నుంచి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట, పంజాగుట్ట, ఉప్పల్, బోడుప్పల్, నాగోల్, కొత్తపేట, సరూర్ నగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. భారీ వానలతో హుస్సేన్ సాగర్‌లోకి వరదనీరు వచ్చి చేరుతోంది.
హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. ఈ రోజు సాయంత్రం నుంచి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట, పంజాగుట్ట, ఉప్పల్, బోడుప్పల్, నాగోల్, కొత్తపేట, సరూర్ నగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. భారీ వానలతో హుస్సేన్ సాగర్‌లోకి వరదనీరు వచ్చి చేరుతోంది. హుస్సేన్ సాగర్‌లో మంగళవారం మధ్యాహ్నం నాటికి నీరు దాదాపుగా ఫుల్ ట్యాంక్ లెవల్ కు చేరుకుంది. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 అడుగులు కాగా, మధ్యాహ్నం సమయానికి 513.63 అడుగులకు నీరు చేరుకుంది. సాగర్‌లోకి 1850 క్యూసెక్కుల నీరు వస్తుండగా, గేట్లు ఎత్తి 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో భారీ వర్షం, ప్రమాదకరంగా హుస్సేన్ సాగర్, భారీగా వచ్చి చేరుతున్న వరదనీరు, లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
Here's Video