Heavy Rain in Hyderabad: వీడియో ఇదిగో, భారీ వర్షానికి బండితో సహా రోడ్డుపై సగం దూరం కొట్టుకుపోయిన వ్యక్తి, కాపాడిన స్థానికులు
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.పంజాగుట్టలో ఓ అపార్ట్ మెంట్ పై పిడుగుపడింది. సిటీ రోడ్లు నదులను తలపిస్తున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.పంజాగుట్టలో ఓ అపార్ట్ మెంట్ పై పిడుగుపడింది. సిటీ రోడ్లు నదులను తలపిస్తున్నాయి.మరో మూడు గంటల్లో భారీ వర్షం ముంచెత్తనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు.భారీ వర్షానికి రాంనగర్‌లో బండితో సహా రోడ్డుపై సగం దూరం కొట్టుకుపోయిన వ్యక్తిని యువకులు కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్, వచ్చే రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక, కుండపోత వర్షానికి నదులను తలపిస్తున్న రోడ్లు
Here's Video