Mahabubabad Horrer: మహబూబాబాద్‌లో దారుణం.. వివాహితను హత్యచేసి పాతిపెట్టిన అత్తింటివారు, శవాన్ని పూడ్చిన బొందపైనే కట్టెల పొయ్యితో పిండి వంటలు, షాకింగ్ వీడియో

మహబూబాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. వివాహితను హత్య చేసి ఇంటి ఆవరణలో పూడ్చి పెట్టారు అత్తింటివారు.

Horrific Crime in Mahabubabad Woman Murdered and Buried in House Premises(video grab)

మహబూబాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. వివాహితను హత్య చేసి ఇంటి ఆవరణలో పూడ్చి పెట్టారు అత్తింటివారు. అంతేగాదు శవాన్ని పూడ్చిన బొందపైనే కట్టెల పొయ్యి పెట్టి పిండి వంటలు చేసి పైశాచికాన్ని ప్రదర్శించారు.

మహబూబాబాద్ లోని సిగ్నల్ కాలనీలో నివాసం ఉంటున్న నాగమణి (35) అనే వివాహితను చంపి ఇంటి ఆవరణలోని కట్టెల పొయ్యి వద్ద పూడ్చి పెట్టారు అత్త కాటి లక్ష్మి, మామ కాటి రాములు, ఆడపడుచు దుర్గా, భర్త గోపి. దుర్వాసన రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పాతిపెట్టిన చోట తవ్వుతుండగా నాగమణి మృతదేహం బయటపడింది. ఇంటికి తాళం వేసి పరారయ్యారు మృతురాలి అత్త, మామ, భర్త, ఆడపడుచు. స్థానికంగా విషాదాన్ని నింపింది ఈ ఘటన.  అచ్చంపేటలోని భ్రమరాంబ ఆలయం వద్ద ఉద్రిక్తత..బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఆలయంలోకి అనుమతించని పోలీసులు..తోపులాట, వీడియోలు ఇవిగో

Horrific Crime in Mahabubabad: Woman Murdered and Buried in House Premises

వివాహితను హత్య చేసి ఇంటి ఆవరణలో పూడ్చి పెట్టిన అత్తింటివారు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now