Secunderabad Fire Accident: సికింద్రాబాద్ క్లాక్ టవర్ సమీపంలోని నవకేతన్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం, ఎగిసి పడుతున్న మంటలు..

సికింద్రాబాద్ క్లాక్ టవర్ సమీపంలోని నవకేతన్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాంప్లెక్స్ లోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగగా, నిప్పు కీలలు ఎగిసి 5వ అంతస్తు వరకూ మంటలు వేగంగా వ్యాపించాయి.

Representative image (Photo Credit: Pixabay)

సికింద్రాబాద్ క్లాక్ టవర్ సమీపంలోని నవకేతన్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాంప్లెక్స్ లోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగగా, నిప్పు కీలలు ఎగిసి 5వ అంతస్తు వరకూ మంటలు వేగంగా వ్యాపించాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫైర్ ఇంజన్లతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను ఆర్పుతున్నారు. అగ్నిప్రమాదం కారణంగా సమీప  ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. నవకేతన్ కాంప్లెంక్స్ సెల్లార్‌లో సైతం  మంటలు ఎగసి పడుతున్నాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా లేదా అనే సమాచారం తెలియాల్సి ఉంది.

Fire accident (Credits: Twitter)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement