Virat Chandra: ఏడేళ్ల పసి ప్రాయంలో కిలిమంజారోను ఎక్కేశాడు, చిన్న వయసులోనే శిఖరాధిరోహణ చేసిన వారిలో చోటు సంపాదించుకున్న హైదరాబాద్ చిన్నారి విరాట్ చంద్ర, మార్చి 6న కిలిమంజారోలోని ఉహురు శిఖరాన్ని చేరుకున్న బుడతడు
ఏడేళ్ల పసి ప్రాయంలోనే ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరాల్లో ఒకటైన కిలిమంజారోను అధిరోహించి శెభాష్ అనిపించుకున్నాడు హైదరాబాద్ చిన్నారి విరాట్ చంద్ర. ముందు చాలా భయమేసినా.. తన లక్ష్యాన్ని చేరాలన్న సంకల్పంతో శిఖరాన్ని అధిరోహించానని విరాట్ చెబుతున్నాడు. ఆ శిఖరాన్ని అధిరోహించి చిన్న వయసులోనే శిఖరాధిరోహణ చేసిన వారి జాబితాలో చోటు దక్కించుకున్నాడు. మార్చి 6న విరాట్ బుడతడు ఈ ఘనత సాధించాడు. అతడిలో పర్వతాధిరోహణపై ఎంతో తపన ఉండేదని అతడి కోచ్ భరత్ చెప్పారు. అతడితో పాటు మిగతా పిల్లలకు శిక్షణనిచ్చినా వారు మధ్యలోనే తప్పుకొన్నారని, విరాట్ మాత్రం అనుకున్నది సాధించేందుకు పట్టుదలతో కృషి చేశాడని అన్నారు. మార్చి 5న ట్రెక్కింగ్ ను మొదలుపెడితే.. మార్చి 6న కిలిమంజారోలోని ఉహురు శిఖరాన్ని చేరుకున్నామన్నారు.
ఏడేళ్ల పసిప్రాయంలో కిలిమంజారోను ఎక్కేసిన విరాట్ చంద్ర
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)