Hyderabad Accident: ఇంత దారుణమా, ప్రాణం పోతోంది రక్షించమని వేడుకున్నా సాయం చేయని జనం, ఫోటోలు తీసుకుంటూ కాలక్షేపం
108 వచ్చి ఆసుపత్రికి తరలించే లోపు ఎలందర్ మృతి చెందాడు.మృతునికి ఇద్దరు చిన్నపిల్లలు, భార్య ఉన్నారు.
హైదరాబాద్ - కీసర ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో రాంపల్లి చౌరస్తా వద్ద వరంగల్ జిల్లాకి చెందిన ఎలందర్ (35) అనే వ్యక్తి తాను నిర్మిస్తున్న ఇంటిని చూసేందుకు స్కూటీ పై వెళ్తుండగా వెనుక నుండి వచ్చిన లారీ ఢీ కొట్టి కింద పడ్డాడు.స్థానికులు గమనించి కేకలు లారీని ఒక్కసారిగా రివర్స్ చేయడంతో ఎలందర్ రెండు కాళ్ల పై నుండి వెళ్ళింది, రెండు కాళ్ళు నుజ్జు నుజ్జు అయ్యాయి.
రక్తం మడుగులో ఉన్న ఎలందర్ నొప్పితో అల్లాడుతూ తనను కాపాడమని వేడుకున్నాడు. అక్కడ ఉన్న జనం ఫోటోలు, వీడియోలు తీస్తూ 108 వెహికల్ వచ్చే వరకు గడిపారు. 108 వచ్చి ఆసుపత్రికి తరలించే లోపు ఎలందర్ మృతి చెందాడు.మృతునికి ఇద్దరు చిన్నపిల్లలు, భార్య ఉన్నారు.
Hyderabad Road Accident
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)