Cockroach Found in Dosa: దోశ తింటుండగా ప్రత్యక్షమైన బొద్దింక.. కంగుతిన్న కస్టమర్.. హైదరాబాద్ స్వాతి టిఫిన్స్‌ లో ఘటన

హోటల్స్ లో సర్వ్ చేసే ఆహార పదార్థాల నాణ్యతపై ఎన్ని ఫిర్యాదులు వస్తున్నా రెస్టారెంట్ల యాజమాన్యాల తీరు మాత్రం మారడం లేదు. హైదరాబాద్ లో సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి ఎదురుగా ఉన్న స్వాతి టిఫిన్స్‌ లో తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

Cockroach found in Dosa (Credits: X)

Hyderabad, Nov 3: హోటల్స్ (Hotel) లో సర్వ్ చేసే ఆహార పదార్థాల (Food Quality) నాణ్యతపై ఎన్ని ఫిర్యాదులు వస్తున్నా రెస్టారెంట్ల యాజమాన్యాల తీరు మాత్రం మారడం లేదు. హైదరాబాద్ లో సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి ఎదురుగా ఉన్న స్వాతి టిఫిన్స్‌ లో తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. రాఘవేంద్ర కుమార్ అనే ఓ వ్యక్తి స్వాతి టిఫిన్స్ లో దోశ ఆర్డర్ చేసి, తింటుండగా అందులో బొద్దింక రావడంతో షాక్ అయ్యాడు. దీనిపై యజమాన్యాన్ని ప్రశ్నించినప్పటికీ నిర్లక్ష్యపు సమాధానం వచ్చినట్లు వాపోయాడు. జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే హోటల్ యాజమాన్యంపై  చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

ఏపీ అసెంబ్లీ సమావేశాల ముహూర్తం ఖరారు.. ఈ నెల 11 నుంచి సభ ప్రారంభం.. కనీసం పదిరోజుల పాటు సమావేశాలు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement