Video: పీకల దాకా తాగిన పోలీస్ కానిస్టేబుల్‌, అర్థరాత్రి రోడ్డు మీద అసభ్యకరంగా తిడుతూ వసూలు దందాలు, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన శంషాబాద్‌ పోలీసులు

ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ రాజమల్లయ్య (35) మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో కొత్వాల్‌గూడ ఔటర్‌రింగ్‌ రోడ్డు సర్వీసు రోడ్డులో తన కారును రోడ్డుకు అడ్డంగా పెట్టాడు

Representational Image | (Photo Credits: IANS)

శంషాబాద్‌లో ఓ పోలీస్ కానిస్టేబుల్‌ పీకల దాకా మద్యంతాగి రోడ్డుపై వీరంగం సృష్టించాడు. ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ రాజమల్లయ్య (35) మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో కొత్వాల్‌గూడ ఔటర్‌రింగ్‌ రోడ్డు సర్వీసు రోడ్డులో తన కారును రోడ్డుకు అడ్డంగా పెట్టాడు.ఆ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న వాహనాలను ఆపి డబ్బు వసూలుకు కూడా పాల్పడ్డాడని పేర్కొన్నారు. గచ్చిబౌలి నుంచి వస్తున్నఅశ్విన్ రెడ్డి దంపతులను కారు ఆపి అసభ్యకరంగా మాట్లాడడంతో వారు 100 ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆర్‌జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి అతడిని రిమాండ్‌కు తరలించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)