Hyderabad Fire: వీడియో ఇదిగో, ఎస్సార్‌నగర్‌లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా ఎగసిన మంటలు, ప్రయాణికులు సేఫ్, మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధం
హైదరాబాద్‌లో ఎస్‌ఆర్ నగర్ చౌరస్తా వద్ద అర్ధరాత్రి సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. మియాపూర్ నుంచి విజయవాడకు వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమౌన డ్రైవర్ రోడ్డుపై బస్సును ఆపి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు.
హైదరాబాద్‌లో ఎస్‌ఆర్ నగర్ చౌరస్తా వద్ద అర్ధరాత్రి సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. మియాపూర్ నుంచి విజయవాడకు వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమౌన డ్రైవర్ రోడ్డుపై బస్సును ఆపి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. బస్సులోని ఏసీ విభాగం నుంచి మంటలు వ్యాపించడంతో క్రమంగా బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న హైదరాబాద్ అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పి, మరింత నష్టాన్ని నివారించారు.
ఈ ప్రమాదంతో కూకట్‌పల్లి–పంజాగుట్ట మధ్య రహదారి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎస్‌ఆర్ నగర్ మెట్రో స్టేషన్ పొగతో నిండిపోయింది. అయితే, అప్పటికే మెట్రో సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులకు పెద్ద ఇబ్బంది ఎదుర్కోవాల్సిన అవసరం రాలేదు. ప్రమాదానికి కారణం.. బస్సు ఏసీ విభాగంలో మంటలు చెలరేగడమే అని అధికారులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో ప్రయాణికులను కాపాడిన డ్రైవర్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు.
Fire Breaks Out in Private Travel Bus in SR Nagar