Hyderabad Fire Video:హైదరాబాద్ పాతబస్తీ జాకీ షోరూమ్‌లో అగ్నిప్రమాదం, మదీనా బిల్డింగ్ జాకీ షోరూమ్ లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

హైదరాబాద్ లో వరుసగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి.తాజాగా పాతబస్తీలోని మదీనా బిల్డింగ్ జాకీ షోరూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో షోరూమ్ లో ఉన్న బట్టలన్నీ కాలిపోయాయి.

Representative image (Photo Credit: Pixabay)

హైదరాబాద్ లో వరుసగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా పాతబస్తీలోని మదీనా బిల్డింగ్ జాకీ షోరూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో షోరూమ్ లో ఉన్న బట్టలన్నీ కాలిపోయాయి. వార్త సంస్థ PTI తెలిపిన వీడియో ప్రకారంగా దట్టమైన నల్లటి పొగతో దుకాణం అంతా చుట్టుముట్టింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చెందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అక్కడ ఉన్న పరిస్థితి మారడంతో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now