
Newdelhi, Feb 23: పోప్ ఫ్రాన్సిస్ (88) (Pope Francis) ఆరోగ్యం మరింత (Critical Condition) విషమించింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో రోమ్ లోని గెమిల్లీ ఆసుపత్రిలో చేరిన ఆయన పరిస్థితి మరింతగా దిగజారింది. ఈ నెల 14 నుంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో శనివారం ఆయన మరింతగా ఇబ్బంది పడ్డారు. దీంతో అధిక పీడనంతో (హై ఫ్లో) ఆక్సిజన్ అందిస్తున్నారు. ఎనీమియా సంబంధిత సమస్యను గుర్తించిన వైద్యులు రక్తాన్ని కూడా మార్చారు. శుక్రవారం కంటే శనివారం మరింత కష్టంగా గడిచిందని, ఈ సమయంలో ఏమీ చెప్పలేమని వాటికన్ సిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. పోప్ న్యూమోనియాతోపాటు తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. మరో వారం రోజులపాటు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుందని పేర్కొన్నారు.
Pope Francis remains in "critical" condition after suffering "respiratory crisis" earlier on Saturday, the Vatican sayshttps://t.co/ZiCEgkTu90
— BBC Breaking News (@BBCBreaking) February 22, 2025
దక్షిణార్థ గోళం నుంచి తొలి పోప్
అర్జెంటినా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో 1936లో జన్మించిన పోప్ అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. 2013లో నాటి పోప్ బెనెడిక్ట్-16 రాజీనామా చేయడంతో ఫ్రాన్సిస్ కేథలిక్ చర్చి అధిపతి అయ్యారు. కాగా, దక్షిణార్థ గోళం నుంచి పోప్ అయిన తొలి వ్యక్తిగా పోప్ ఫ్రాన్సిస్ రికార్డులకెక్కారు.