Hyderabad Fire: కాటేదాన్‌లో భారీ అగ్నిప్రమాదం, డ్రమ్స్ కంపెనీలో ఒక్కసారిగా ఎగసిన మంటలు, వీడియో ఇదిగో..

రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడ‌లో ఈ రోజు తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. నేతాజీన‌గ‌ర్‌లోని ఏషియ‌న్ బ్యార‌ల్స్ డ్ర‌మ్ముల త‌యారీ కంపెనీలో మంట‌లు చెల‌రేగాయి. కంపెనీలో అగ్నికీల‌లు ఎగిసిప‌డ‌టంతో ఆ ప్రాంతంలో పొగ‌లు ద‌ట్టంగా అలుముకున్నాయి.

Fire accident (Credits: Twitter)

రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడ‌లో ఈ రోజు తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. నేతాజీన‌గ‌ర్‌లోని ఏషియ‌న్ బ్యార‌ల్స్ డ్ర‌మ్ముల త‌యారీ కంపెనీలో మంట‌లు చెల‌రేగాయి. కంపెనీలో అగ్నికీల‌లు ఎగిసిప‌డ‌టంతో ఆ ప్రాంతంలో పొగ‌లు ద‌ట్టంగా అలుముకున్నాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేశారు. షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగా మంట‌లు చెల‌రేగిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అగ్నిప్ర‌మాదం కార‌ణంగా స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now