Hyderabad: ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ట్రాఫిక్ హోంగార్డు మృతి, వాళ్లిద్దరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ హోంగార్డు భార్య సంచలన ఆరోపణలు
హైదరాబాద్ నగరంలో గోషామహల్‌లో నాలుగు రోజుల క్రితం పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్న ట్రాఫిక్ హోంగార్డు ఎం. రవీందర్ (38) మృతిచెందాడు. అపోలో డీఆర్‌డీఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించాడు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
హైదరాబాద్ నగరంలో గోషామహల్‌లో నాలుగు రోజుల క్రితం పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్న ట్రాఫిక్ హోంగార్డు ఎం. రవీందర్ (38) మృతిచెందాడు. అపోలో డీఆర్‌డీఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించాడు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఆదివారం నగర ట్రాఫిక్ కమాండెంట్ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న సంగతి విదితమే.
60 శాతానికి పైగా తీవ్రంగా గాయపడిన అతడిని తొలుత ఉస్మానియాకు తరలించారు. అయితే పరిస్థితి విషమంగా మారడంతో కాంచన్‌బాగ్‌లోని అపోలో డీఆర్‌డీవో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఊపిరితిత్తులు దెబ్బతినడంతో వెంటిలేటర్ ద్వారా వైద్యులు కృత్రిమ శ్వాస అందించారు. పరిస్థితి మరింత విషమించడంతో శుక్రవారం ఉదయం అతడు మృతిచెందాడు.
హోంగార్డు రవీందర్ మృతిపై ఆయన భార్య సంధ్య స్పందించారు. తన భర్త 17 ఏళ్లుగా నిబద్ధతతో విధులు నిర్వహించారని తెలిపారు. రవీందర్ ఫోన్ అన్‌లాక్ చేసి డేటా డిలీట్ చేశారని ఆరోపించారు. తన భర్తను ఏఎస్సై నర్సింగ్‌రావు, కానిస్టేబుల్ చందు వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. ఇప్పటి వరకు వాళ్లిద్దరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. రవీందర్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని సంధ్య డిమాండ్ చేశారు.
Here's Her Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)